VHVSP Registration
Sri Ramanuja Scheme Online Registration

Vedahitha - Veda / Shastra Pandits Scheme (VHVSP) - ONLINE REGISTRATION

                                      వేద/ శాస్త్రపండితులకు గౌరవ భృతి పథకం- మార్గదర్శకాలు
  • వయో వృధ్ధులైన వేద మరియు శాస్త్రపండితులకు తెలంగాణ ప్రభుత్వము ప్రతినెలా గౌరవభృతి ఇచ్చి సత్కరించవలెనని నిర్ణయించినది.
  • ఈ పథకం 2018 నాటి నుండి ప్రభుత్వ ఉత్తర్వులు నం:118/Cabinet/A2/2018, తేదీ18-07-2018 ప్రకారము అమలు చేయబడుతున్నది.
  • మొదట ఈ పథకం క్రింద వేద మరియు శాస్త్ర పండితులై 75 సంIIలు పైబడి వయస్సు కల్గిన బ్రాహ్మణ వయో వృద్దులకు నెలకు రూ.2,500/- చొప్పున గౌరవ భృతి ఇవ్వడం జరిగినది
  • అనేక బ్రాహ్మణ హితార్థుల విజ్ఞప్తి మేరకు బ్రాహ్మణ స్తంక్షేమ పరిషత్తు సర్వసభ్య సమావేశము ఈ గౌరవ భృతి మొత్తమును రూ.2,500/- నుండి రూ.5,000/- వరకు పెంచుతూ మరియు అర్హత వయస్సును 75 నుండి 60 స్తం||లు వరకు తగ్గిస్తూ తీర్మాణం చేసినారు.
  • ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగినది
  • ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పంపించిన ప్రతిపాదనలు ఆమోదించి గౌరవ భృతి మొత్తం రూ.2,500/- నుండి రూ.5,000/- కు పెంచడం పెంచుతూ మరియు అర్హత వయస్సును 75 నుండి 60 సంIIలకి తగ్గిస్తూ G.O.Rt. No.996 General Administration (Cabinet) Department, Dated:12-07-2023 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినది
  • ఈ పథక అమలుకై ప్రభుత్వ మార్గదర్శకాలు క్రింది విధంగా ఉన్నాయి

  • వేద పండితులు:

    రాష్ట్ర దేవాదాయ శాఖ వేద పండితుల నియామకానికై నిర్ణయించిన ప్రాతిపదికను అనుసరించి ఈ పథకం కింద గౌరవభృతి మంజూరునకై అర్హత నిర్ణయింపబడుతుంది. దేవాదాయ శాఖ ఉత్తర్వు సంఖ్య G.O.Ms. No.261, Revenue (Endowments-I), Dated:20-05-2002 ప్రకారము వేద పండితులకు అర్హత ప్రాతిపదికను నిర్ణయించినది. ఈ ఉత్తర్వులో వేద పండితుల అర్హత ప్రాతిపదిక సంబంధించి పేర్కొనబడిన అంశములు సంక్షిప్తంగా:
    1. శుక్ల లేదా కృష్ణ యజుర్వేదంలో క్రమాంతం
    2. ఋగ్వేదంలో మూలం లేదా సంహిత
    3. అధర్వణ వేదంలో మూలం లేదా సంహిత
    4. సామవేదంలో పదాంతంలో కూడిన చండీయాగం

    5. పైన పేర్కొనబడిన వేద విభాగాలలో ప్రాధికార వేద సభ నుండి పొందిన యోగితా పత్రమును సమర్పించవలసి ఉంటుంది

    శాస్త్ర పండితులు

    శాస్త్ర పండితులు ఈ క్రింద పేర్కొనబడిన శాస్త్రంలో కనీసం ఏదో ఒకదానియందు నిష్ణాతులై ప్రాధికార సంస్థ నుండి యోగ్యతా పత్రములు పొంది ఉండవలెను.
    1. తర్కం:
    2. i. బాధాంతం
      ii.సప్రతి ప్రక్షాంతం
      iii.సిద్ధాంత లక్ష్మణాంతం
      iv.ముక్తావళి అంశం
    3. వేదాంతం:
    4. i. పరిభాషాంతం
      ii.భగవద్గీతాంతం
      iii.బ్రహ్మసూత్రాన్తం
      iv. భాష్య వ్యాఖ్యాంతం
      v. భామత్యంతం
    5. మీమాంస:
    6. i. అర్ధ సంగ్రహాన్తం
      ii. న్యాయ ప్రకాశాంతం
      iii. భాట దీపికాంతం
      iv. ప్రభాకర వృత్యంతం
      v. వేద బాష్యాన్తం
    7. వ్యాకరణం:
    8. i. సిద్ధాంత కౌముద్యన్తం
      ii. బాల మనోరమ తత్వ బోధిని అంతం
      iii. భాష్యాన్తం
    9. యోగశాస్త్రం:
    10. i. క్రియా యోగాంతం
      ii. అఘాంతం
      iii. పతంజలి యోగ సుత్రాన్తమ్
    11. సాంఖ్య శాస్త్రం:
    12. i. సాంఖ్యతత్వ కౌముద్యన్తం
      ii. సాంఖ్యకారికాంతం
    13. శాస్త్ర పరిధిలోని ఏదేని ఇతర విషయమునందు ప్రజ్ఞావంతులైన వారు తాము ప్రావీణ్యము పొందిన విషయానికి సంబంధించి సమగ్ర వివరణ దరఖాస్తునకు ప్రత్యేకంగా జతపరచవలసి ఉంటుంది.