Guidelines of Study Circle for Online Application

  • తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ ఉద్యోగార్థులైనా బ్రాహ్మణ నిరుద్యోగులకు పోటీ పరీక్షల నిమిత్తమై తీసుకొను కోచింగ్ మరియు స్టడీ మెటీరియల్ కొరకు ఆర్ధిక సహాయం చేయుటకు బి.సి సంక్షేమ శాఖ తో అవగాహన కుదుర్చుకున్నది. ఫలితంగా వివిధ పోటీ పరరిక్షలకు హాజరయ్యే బ్రాహ్మణ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొనవచ్చును. దీనికి సంభందించి www.brahminparishad.telangana.gov.in వెబ్ సైట్ నందు 01 -05 -2022 నుండి 12 -05 -2022 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. 13-05-2022 నుండి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషద్, 3 వ అంతస్తు ,ధార్మిక భవనం, కమీషనర్ వారి కార్యాలయం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, బొగ్గులకుంట, తిలక్ రోడ్, హైదరాబాద్-500001 కార్యాలయం నందు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది . తదుపరి ఎంపికైన అభ్యర్థుల జాబితాను BC స్టడీ సర్కిల్ కి పంపడం జరుగుతుంది .16-05-2022 నుండి కోచింగ్ తరగతులు ఆయా సెంటర్లలో నిర్వహించ వలెనని బ్రాహ్మణ పరిషద్ ఆశిస్తున్నది.